టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది.
ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు.
అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.. మరో ఒక్క పరుగు చేస్తే కోహ్లీ రోహిత్ ను దాటి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు..