Home / ANDHRAPRADESH / వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు..టీటీడీ సేవలు భేష్..!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు పోటెత్తిన భక్తులు..టీటీడీ సేవలు భేష్..!

ముక్కోటి ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠవాసుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. దాదాపు 20 గంటల పాటు వేచి ఉన్న భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుని పులకించిపోయారు.దాదాపు 4 లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ షెడ్లు ఏర్పాటు చేసింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగాభక్తులు సంతోషంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామని టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది కాబట్టి..రెండు రోజుల పాటు అంటే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని వైవి పేర్కొన్నారు. ఈ మేరకు గత 15 రోజుల నుంచి టీటీడీ అధికారులు, సేవకులు, పోలీసులతో అన్ని రకాల ఏర్పాట్లు పకడ్బందీగా చేసినట్లు వైవీ తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆదివారం మధ్యాహ్నానికే లక్షా 20 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారని, అయితే ఎంత మంది భక్తులు వచ్చినా..ఎక్కడా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని సౌకర్యాలతో..కాఫీ, టీ, భోజనం, నీటి వసతితో సహా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లన్నీ భక్తులతో నిండిపోయాయి. వారికి నిరంతరం అల్పాహారం, అన్నప్రసాదం, టీ, కాఫీలు పంపిణీ చేస్తున్నారు. 172 ప్రాంతాల్లో 3 లక్షల వాటర్‌ బాటిళ్లు పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధం చేశారు. ఇక వీఐపీ భక్తుల దర్శనం రెండున్నర గంటల్లో పూర్తి చేసి సామాన్య భక్తులను ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇచ్చామని ఆయన చెప్పారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే సామాన్య భక్తులకు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించడం జరిగిందని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ రోజు ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులకు రాత్రి 12 గంటలవరకు దర్శనం పూర్తి అవుతుందని వైవీ స్పష్టం చేశారు. ద్వాదశి నాడు శ్రీవారి దర్శించుకునే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఛైర్మన్ ఉద్ఘాటించారు. మొత్తంగా లక్షలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా…టీటీడీ సేవలందించడం అభినందనీయం.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat