ఏపీలో కడప జిల్లా జమ్మలమడుగులోని గండికోట కు ఒక్కసారి వెళ్లి వద్దామా..?. ఎందుకు ..?. ఏమి అని తెగ ఆలోచిస్తున్నారా..?. ఎందుకని అడుగుతున్నారా..?. ఎందుకంటే జమ్మలమడుగులోని గండికోట ఉత్సవాలకు సిద్ధమవుతుంది.
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల పదకొండు,పన్నెండు తారీఖుల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు సంబంధిత అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు.
గండికోట చరిత్ర,ప్రాశస్త్యాన్ని నేటి తరానికి తెలియజేసేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఈ ఉత్సవాలను ఈ సారి జనవరి నెలలో నిర్వహిస్తున్నారు.కడప ,ముద్దనూరు ,జమ్మలమడుగు నుండి గండికోటకు చేరుకోవచ్చు.