ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయచ్చు అంటూ జీఎన్‌రావు కమిటీ నివేదిక ఇచ్చిన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ…. జీఎన్ రావు పనికిమాలిన అధికారి అని.. ఆయన పేరుతో కమిటీ వేశారని దూషించాడు.. జీఎన్‌రావు ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా పని చేసిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన నేతృత్వంలో రాజధాని అంశంపై వైసీపీ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. ఈ మేరకు అధికార, పరిపాలనా వికేంద్రీకరణ దిశగా కర్నూలులో జ్యుడీషియరీ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అమరావతిలో లెజిస్టేటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై చంద్రబాబు నిప్పులు చెరిగాడు..సీనియర్ అధికారి అని కూడా చూడకుండా…జీఎన్ రావు ఓ పనికిమాలిన వ్యక్తి అని తిట్టిపోశాడు. సీఎం జగన్ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లాం చెప్పినట్లుగా జీఎన్ రావు నివేదిక రాసి ఇచ్చాడని చంద్రబాబు ఆరోపించారు.
చంద్రబాబు ఆరోపణలపై జీఎన్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. అజయ్ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారమన్నారు. కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమన్నారు. ప్రజల ఆకాంక్షలను పరిగణలోకి తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని స్పష్టం చేశారు. చంద్రబాబు భాంత్రితో మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ రహస్యంగా నివేదిక రూపొందించారని జీఎన్‌రావు వివరించారు. తమ కమిటీలో అపార అనుభవమున్న నిపుణులు నిష్ణాతులు ఉన్నారని.. ప్రజలు నిపుణులతో మాట్లాడి నివేదిక రూపొందించామని.. 13 జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఉన్నతాధికారులతో పాటు అందరి అభిప్రాయాలు స్వీకరించామని తెలిపారు. తాము ఏపీకి రాజధానితోపాటు 13 జిల్లాల శ్రేయస్సు కోసం ఆలోచించి నివేదిక రూపొందించామని తెలిపారు. నివేదిక సమయంలో సీఎంతో సహా మంత్రులు అధికారులు ఎవ్వరి నుంచి సూచనలు తీసుకోలేదని స్పష్టం చేశారు. మొత్తంగా పనికిమాలిన వ్యక్తి అంటూ తనను తిట్టిపోసిన చంద్రబాబుకు జీఎన్‌రావు హుందాగా మాట్లాడుతూనే అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు.కాగా చంద్రబాబు బీసీజీ కమిటీ రిపోర్ట్‌ను వివరించిన మరో ఐఏయస్ అధికారిని విజయ్‌కుమార్ గాడు మాకు చెబుతాడా అంటూ నోరు పారేసుకున్నాడు దీంతో దళిత ఐఏయస్ అధికారిని కించపర్చిన చంద్రబాబుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. చంద్రబాబుకు అమరావతిలో భూముల విలువ తగ్గిపోతుందని, తమ సామాజికవర్గం భారీగా నష్టపోతుందనే ఫ్రస్టేషన్‌లో ఇలా ఐఏయస్ అధికారులపై నోరుపారేసుకుంటున్నాడు. మొత్తంగా చంద్రబాబుకు ఫ్రస్టేషన్ పీక్స్‌లోకి వెళ్లిపోయిందనే చెప్పాలి.