ఉగాది రోజున రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 25లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు, అధికారులకు పలు సూచనలు చేసింది. ఈ కార్యక్రమాన్ని మఖ్యమంత్రి వైయస్.జగన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని కలెక్టర్లు, ఇతర అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది. కేవలం ఇళ్ల పట్టాలు మంజూరే కాకుండా, వాటిని లబ్దిదారులు పేరుమీద రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వాటిపై రుణాలు పొందే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ పధకం వల్ల ఇళ్ల స్ధలాలతో పాటు నవరత్నాల వంటి పథకాల వలన సమాజంలో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల వారికి మెరుగైన జీవన ప్రమాణాలు ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి బలంగా విశ్వసిస్తున్నారు.
ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ సీఎంఓ అధికారులను జిల్లాల పర్యటనకు నేరుగా వెళ్లమని ఆదేశించారు. ఇందులో భాగంగానే గత వారం ఐదు జిల్లాల్లో పర్యటించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఈ పర్యటనలో తమ దృష్టికి వచ్చిన అంశాలను కలెక్టర్లుకు తెలియజేశారు.
1, జిల్లాల్లో ఇంకా చాలా చోట్ల ప్రభుత్వ స్ధలాలను జాయింట్ కలెక్టర్లు, సబ్‌కలెక్టర్లు, ఆర్డీవోల వంటి సీనియర్ అధికార్లు సందర్శించలేదు
- ప్రభుత్వానికి చెందిన భూమితో పాటు వివిధ ప్రభుత్వ రంగ సంస్ధల ఆధీనంలో ఉన్న భూములను కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్టీవోలు నేరుగా పరిశీలిస్తే తప్ప వాటి స్ధితిగతులపై అంచనాకు రాలేం.
3, వీటిపై కలెక్టర్లు ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయడంతో పాటు వచ్చే వారం రోజుల్లో దాన్ని అమలు చేయాలి
దీంతో పాటు కింది అంశాలకు సంబంధించి సమగ్రంగా ఒక నివేదిక తయారు చేయాలి.
ఎ) సుప్రీం కోర్టులో వివాదంలో ఉన్న భూమల వివరాలు
బి)హైక్టోర్లులో వివాదంలో భూముల వివరాలు
సి)జిల్లా కోర్టుల్లో వివాదంలో ఉన్న భూముల వివరాలు
డి)కమిషనర్లు, అప్పీల్స్ కార్యాలయం,సీసీఎల్‌ఎ వద్ద వివాదంలో ఉన్న భూముల వివరాలు
ఇ)సర్వే సెటిల్‌మెంట్ కమిషనర్ వద్ద వివాదంలో ఉన్న భూముల వివరాలు
ఎఫ్) వివిధ ప్రభుత్వ శాఖల వద్ద నిరుపయోగంగా ఉన్న భూముల వివరాలు
జి)ఇతరత్రా నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు
హెచ్)పైన పేర్కొన్న వివిధ రకాల వివాదాల్లో ఉన్న భూములను పరిష్కరించడంతో పాటు వాటిని ఇళ్ల పట్టాల పంపిణీని వినియోగించడం
మరోవైపు ఇళ్ల స్ధలాల కోసం గుర్తించిన భూముల్లో వెంటనే జంగిల్ క్లియరెన్స్, భూమి చదును చేసే కార్యక్రమం, హద్దులను గుర్తించడం వంటి కార్యక్రమాలను వచ్చే వారం రోజుల్లో పూర్తి చేయాలి
వీటన్నంటిని నిర్ధిష్ట కాలపరిమితితో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది
4, జిల్లాల్లో మరోసారి వీటి పరిశీలన జరిగేటప్పటికి సంబంధిత జిల్లా అధికార్లు వీటిని పూర్తి చేస్తారని భావిస్తున్నాం
5, పైన పేర్కోన్న ప్రభుత్వ భూములను ఇళ్ల పట్టాల కోసం వినియోగించుకోలేకపోతే అది చాలా బాధాకరం
6, జిల్లా కలెక్టరుల దీనిపై వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది