త్వరలో జరగనున్న స్థానిక సంస్థల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అన్ని జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపైనే ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలిసింది. అలాగే మూడు రాజధానుల ప్రకటనపై ఆయా జిల్లాలోని పరిస్థితులను సీఎం జగన్‌కు మంత్రులు వివరించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతలను జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులకే ముఖ్యమంత్రి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అందరూ సమిష్టిగా పనిచేసి పార్టీని శాసనసభ ఎన్నికల మాదిరిగా గెలిపించుకోవాలని పార్టీ క్యాడర్ భావిస్తోంది.
