దాదాపు రెండు మూడున్నర దశాబ్ధాల పాటు నాలుగు సినిమా ఇండస్ట్రీలను ఏలిన అందాల రాక్షసి.. తన అందంతో యువత మదిని కొల్లగొట్టి.. తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న అతిలోక సుందరీ శ్రీదేవి. గతేడాది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున పెళ్ళికి దుబాయికి వెళ్ళి అక్కడ ప్రముఖ హోటల్లో బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి మృతి చెందిన సంగతి విదితమే.
అయితే ఆమె మరణంపై పలు అనుమానాలను అందరూ వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే మద్యం మత్తులోనే శ్రీదేవి బాత్ టబ్‌లో పడి మునిగి చనిపోయారని వైద్యులు తేల్చి చెప్పారు. అదే రీపోర్టును ఒకే చేసి ఆ కేసును క్లోజ్ కూడా చేశారు అక్కడి పోలీసులు.అయితే తాజాగా సత్యర్థ్ నాయక్ అనే రచయిత సంచలనం విషయం బయట పెట్టారు.
ఆయన మాట్లాడుతూ” శ్రీదేవి బయోగ్రఫీని ఇటీవలే రాశాను. ఆమె కుటుంబ సభ్యులు,సన్నిహితుల దగ్గర పలు వివరాలను సేకరించి ఆమె బయోగ్రఫీ రాశాను అని తేలిపారు. ఈ క్రమంలోనే శ్రీదేవికి రక్తపోటు ఉందని పంకజ్ పరాషర్ ,అక్కినేని నాగార్జున చెప్పారని తన బయోగ్రఫీలో రాశారు..ఈ క్రమంలోనే శ్రీదేవి షూటింగ్ సమయంలో చాలా సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయారు . అయితే ఒకసారి బాత్రూంలో పడటం వలన ఆమె ముఖానికి గాయమై రక్తమోచ్చిందని ఆమె మేనకోడలు చెప్పారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఒకసారి వాకింగ్ చేస్తుంటే శ్రీదేవి కుప్పకూలిందని ఆమె భర్త భోనీ కపూర్ చెప్పారని కూడా ఆయన పేర్కొన్నారు.