చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌తో సహా టీడీపీ నేతలంతా ఒకటే..ఏదైనా ఇష్యూ వస్తే..సీరియస్‌గా పోరాడడం చేతకాదు..ఏదో ఓ రెండు రోజులు దీక్షల పేరుతో హడావుడి చేయడం..ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం బాబు బ్యాచ్‌కు పరిపాటిగా మారింది. ఇటీవల బాబుగారి పుత్రరత్నం లోకేష్ మంగళగిరిలో చేసిన ఇసుక దీక్ష అయితే మామూలు కామెడీ కాదు.. పొద్దున్నే కడుపు నిండా టిఫిన్ చేసి వచ్చిన లోకేష్..ఓ నాలుగు గంటలు దీక్షా శిబిరంలో కూర్చుని..వంధిమాగధులతో జగన్‌ను తిట్టించి…వెంటనే ఆకలవుతుందని నిమ్మరసం తాగి వెళ్లిపోయాడు. లోకేష్ నాలుగుగంటల దీక్ష చూసి..ఇదేమి దీక్ష అని మందలగిరి..సారీ మంగళగిరి ప్రజలు నోరెళ్లబెట్టారు. ఇక బాబోరు కూడా ఏం తక్కువ తిన్లేదు..కాకపోతే లోకేష్ అంటే ఆకలికి తట్టుకోలేడు..బాబుగారు అలా కాదు..లిమిట్‌గా తినడమే కాదు..యోగా, ఫిట్‌నెస్ చేస్తాడు కదా అందుకు కాస్త స్టామినా ఎక్కువ.. అందుకే అదే ఇసుకదీక్షను ఓ 12 గంటలు లాగించేసి వెళ్లిపోయాడు. బాబుగారు అలా దీక్షల్లో సోఫాలు, మెత్తటి పరుపులు వేసుకుని, చుట్టూ ఏసీ కూలర్లు పెట్టుకుని, ఓ దండేసుకుని బాబాగారిలా కూర్చుంటే తెలుగు తమ్ముళ్లంతా ఒకరి తర్వాత ఒకరు వచ్చి…ఆయన కాళ్లకు పొర్లు దండాలు పెట్టడం..బాబుగారు వాళ్లను బాబా లెవెల్లో ఆశీర్వదించడం..ఇదే తంతు.. దీంతో బాబుగారి దీక్షలు కాస్త కామెడీగా మారిపోయాయి.
అయితే తాజాగా ఏపీకి మూడు రాజధానులకు వ్యతిరేకంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నిర్వహించిన సేవ్ అమరావతి దీక్ష కూడా నవ్వుల పాలైంది. సేవ్ అమరావతి..సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ పెనమలూరులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ దీక్ష మొదలెట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని పూర్తి స్థాయి ప్రకటన వచ్చే వరకు ఆమరణ దీక్ష ఆగదని బోడె ప్రసాద్‌తో సహా టీడీపీ నేతలంతా వీరావేశంతో ఉపన్యాసాలు ఇచ్చారు. తీరా చూస్తే..రెండో రోజే శిబిరాల్లో నిమ్మరసాలతో దీక్షలు ముగించడం చూసి ప్రజలు అవాక్కయ్యారు. టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా స్వయంగా బోడె బ్యాచ్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశాడు. అమరావతి ఆందోళనలు తారాస్థాయిలో జరుగుతున్నప్పటికీ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో నిరాహారదీక్షలు ముగించినట్లు బోడె వర్గం చెప్పుకుంటోంది. బోడె బ్యాచ్ ఒక్క రోజు ఆమరణ నిరాహారదీక్షలు చూసి.. బాబు బ్యాచ్ అంతా ఇంతే..ఏ పని చేసినా సీరియస్‌గా చేయరు..అందుకే టీడీపీని ఎవరూ నమ్మడం లేదని ప్రజలు అంటున్నారు.