తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో వర్గాల లొల్లి ఉందని సంగతి విదితమే. ఈ క్రమంలో తాజాగా పార్టీలోని అంతర్గత కలహాలు మళ్లీ భగ్గుమన్నాయి.
ఈ నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన సమీక్ష సమావేశానికి ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్ ,స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు.
వీరి సాక్షిగా భువనగిరిలోని సంకల్ప్ హోటల్‌లో నిర్వహించిన సమావేశంలో తనను వేదికపైకి ఆహ్వానించలేదని జనగామ జిల్లా కాంగ్రెస్ నాయకుడు లింగాల లింగోజీ మండిపడ్డాడు.
స్టేజీ ఎదుట బైఠాయించి కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అక్కడే ఉన్న కోమటిరెడ్డి వర్గీయుడు, మాఎర్రమల్ల సుధాకర్.. లింగోజీని ఎట్టిపరిస్థితుల్లోనూ స్టేజీపైకి పిలవొద్దని నేతలకు సూచించాడు. దీంతో ఇరువర్గాలు గంటసేపు వాదులాడుకొని తోపులాటకు దిగారు.