ప్రస్తుతం తిరుపతి లో ప్యాక్ చేసిన మంచి నీళ్ళు పూర్తి స్థాయిలో నిషేధించారు. ఎక్కడా వాటర్ బాటిళ్లు కూడా దొరకటం లేదు. చివరకు ఖాళీ బాటిళ్లు కూడా కనిపించనివ్వటం లేదు. చాలా ప్రదేశాలలో మంచి నీటి ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. త్రాగే నీళ్ళు ప్లాంట్స్ నుంచి మాత్రమే పట్టుకోవాలి. 5లీటర్ల బాటిళ్లు మాత్రం కొన్ని షాప్స్ లో దొరికేలా ఏర్పాట్లు చేశారు. అయితే ఈ సమయంలో తిరుమల వెళ్లేవారు కచ్చితంగా ఒక ఖాళీ రాగి లేదా గాజు లేదా మరేదైనా బాటిల్ మాత్రం మీ లగేజీ తో పాటు మరిచిపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.
