తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,మంత్రులు,ఎంపీలు,ప్రతినిధులతో నిన్న శనివారం హైదరాబాద్ లో తెలంగాణ భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల వారీగా పార్టీ కార్యకర్తలతో.. నేతలతో.. ఉద్యమకారులతో.. ఎమ్మెల్యేలందరూ సమీక్ష సమావేశాలను నిర్వహించుకోవాలి. అందరితో ఆత్మీయ సమావేశాలు వరుసపెట్టి చేసుకోవాలి.ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజలకు ఆర్ధమయ్యేలా వివరించాలి.
అన్ని విధాలుగా పార్టీ కోసం పని చేస్తున్న నాయకులు,కార్యకర్తలను ఎమ్మెల్యేలు ఆదరించాలి. అందర్నీ ఆకట్టుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు.గత ఎన్నికల్లో ఓడిపోతారని తేల్సిన నన్ను చూసి గెలిపిస్తారనే నమ్మకంతో అందరికీ టికెట్లు ఇచ్చాను. ఇప్పటికైన సరే చెప్పిన మాట వింటే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు లేకపోతే మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని అన్నారు.