ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు ప్రభుత్వం నియమించిన బోస్టన్ కన్సెల్టింగ్ గ్రూపు (బీసీజీ) నివేదికలోని వివరాలను ఐఏయస్ అధికారి ఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ మీడియాకు వివరించారు. అయితే ఈ నివేదకపై మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…బీసీజీ నివేదికను తప్పుపడుతూ…అమరావతిని ఫెయిల్యూర్ నగరాలతో పోలుస్తారా…అయినా విజయ్ కుమార్ గాడు మాకు చెబుతాడా…అంటూ నోరుపారేసుకున్నాడు.
ఐఏయస్ అధికారి విజయ్‌కుమార్‌ను గాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై ఏపీ మంత్రులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, హోంమంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పినిపె విశ్వరూప్, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్ తదితరులు ఓ ప్రకటన చేశారు.
‘బీసీజీ నివేదికను మున్సిపల్‌శాఖ కమిషనర్, ప్రణాళికా సంఘ కార్యదర్శి విజయ్‌కుమార్ ఒక ఐఏఎస్‌గా, ప్రభుత్వాధికారిగా, తన బాధ్యతల నిర్వహణలో భాగంగా వివరించడం జరిగింది. ఆ నివేదిక మీద చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు చవకబారుగా ఉన్నాయనుకుంటే అంతకుమించి ఆయనను, విజయ్‌కుమార్ గాడు అనడంద్వారా తన కుల దురహంకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ కులాల్లో ఎవరన్నా పుట్టాలనుకుంటారా? అని చంద్రబాబు దళితులను అవమానించారని, తోకలు కత్తిరిస్తానని నాయి బ్రాహ్మణులపై చిందులు వేశాడని , ఎస్టీ మహిళలమీద చేయిచేసుకున్నాడని ఈ సందర్భంగా మంత్రులు చంద్రబాబు కులదురహంకారాన్ని గుర్తు చేశారు. అధికారిగా విజయ్‌కుమార్ బాధ్యతలు ఏంటో ఆయన కులం ఏంటో చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఉద్దేశ పూర్వకంగా విజయ్‌కుమార్‌గాడు అని సంబోధించడం ద్వారా…అట్టడుగు వర్గాల పట్ల తనకున్న ఏహ్యభావాన్ని, తన కుల అహంకారాన్ని చంద్రబాబు బయటపెట్టుకున్నాడు.
40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు భాషా సంస్కారంగాని, కులపరమైన సంస్కారం గాని, సామాజిక న్యాయంపట్ల గౌరవం గాని, భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం గాని లేవని మరోసారి స్పష్టమైన నేపథ్యంలో ఆయనను, ఆయన నోటిని అదుపులో పెట్టుకోవాల్సిందిగా మంత్రులు హెచ్చరించారు. ఐఎయస్ అధికారి విజయ్‌కుమార్ గారిపై చేసిన దిగజారుడు వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టుగా అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పాదాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా మంత్రులు డిమాండ్ చేశారు. అంతేకాకుండా స్వయంగా విజయ్‌కుమార్ వద్దకు వెళ్లి, ఆయనకు కూడా మీడియా ముఖంగా క్షమాపణ చెప్పాల్సిందిగా కోరారు. లేని పక్షంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నాం. ఇది జరిగేవరకూ చంద్రబాబు ఏ గ్రామంలో అడుగుపెట్టదలుచుకున్నా, అక్కడి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు వీరుమాత్రమే కాకుండా శాంతి భద్రతలను గౌరవించే ప్రతి ఒక్కరూ చంద్రబాబును ఛీ కొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ మంత్రులు అని తమ ప్రకటనలో కోరారు. మొత్తంగా ఒక ఐఏయస్ అధికారిని కించపరిచి చంద్రబాబు తన కుల దురంహకారాన్ని మరోసారి బయటపెట్టుకున్నాడు..విజయ్‌కుమార్ గాడు అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఐఏయస్ అధికారులతో పాటు ప్రజలంతా మండిపడుతున్నారు. ఛీఛీ..నీది నోరా..తాటిమట్టా..చంద్రబాబు..నిన్ను అందరూ ఛీ కొట్టాల్సిందే అంటూ ఛీత్కరించుకుంటున్నారు.