తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం కాట్రపల్లిలో దారుణమైన సంఘటన జరిగింది.స్థానిక పోలీసుల కథనం ప్రకారం..కాట్రపల్లికి చెందిన రేణికుంట్ల రవి(44)కి కొప్పుల గ్రామానికి చెందిన రజితతో 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.
రజిత భర్తతో తరుచూ గొడవ పడుతూ వరంగల్ వెళ్లి, అక్కడ కూలి పనులు చేస్తూ ఉండేది. శుక్రవారం కాట్రపల్లికి వచ్చిన రజిత మద్యం తాగి ఉన్న రవితో గొడవ పడింది.
రాత్రి 9 గంటల తర్వాత పెద్దగా కేకలు వినిపించడంతో, పక్కనే ఉంటున్న రవి అక్క సుగుణ వారి ఇంటికి వెళ్లి చూసేసరికి రవి కట్టెల పొయ్యిలో పడి మొహం కాలిపోయింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మృతి చెందాడు.
Post Views: 480