ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. విశాఖలో రాయలసీమ ముఠాకోరులు, కబ్జాదారులు చేరి అరాచకం చేస్తారని, పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా పోరాటం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ తాడెపల్లిగూడెంలో మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు సర్కార్ ల్యాండ్ పూలింగ్ ద్వారా బలవంతంగా భూసేకరణ చేస్తుంటే ఇదే అమరావతి గ్రామాల రైతుల ఆందోళనలు చేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించి..రైతులు పెట్టిన పెరుగన్నం తిని..బలవంతంగా భూములు లాక్కుంటే వూరుకునేది లేదు..నేను మీకు అండగా ఉంటాను..అని మభ్యపెట్టి వెళ్లిపోయాడు. ఇదే విషయాన్ని అమర్‌నాథ్ ప్రస్తావిస్తూ…రాజధానిలో పర్యటించి రైతుల పక్షాన ఉంటానని పవన్ కల్యాణ్ డబ్బాడు పెరుగన్నం తిన్నాడని ఎద్దేవా చేశారు. పెరుగన్నం అరగక ముందే హైదరాబాద్ వెళ్లి, మాట మార్చారని విమర్శించారు.
అలాగే విశాఖలో పులివెందుల పంచాయితీ అంటూ చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజల నివాస వేదిక విశాఖపట్నం అని గుడివాడ అమర్‌నాథ్ రెడ్డి చెప్పారు. అసలు చంద్రబాబు ప్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్ధం కావడం లేదని చురకలు అంటించారు. గత ఐదేళ్లలో అమరావతిలో చంద్రబాబు అద్భుతమైన రాజధానిని నిర్మించానని గొప్పలు చెప్పుకుంటారని..అదే జరిగితే లోకేష్ ఎందుకు రాజధానిలో ఓడిపోయాడు..? అని సెటైర్ వేశారు. జీఎన్ రావు, బోస్టన్ గ్రూప్‌కు చట్ట బద్ధతలేదంటన్న టీడీపీ నేతలు మరి నారాయణ కమిటీకి చట్ట బద్ధత ఉందా..? అనేది చెప్పాలని…అమర్‌నాథ్ ప్రశ్నించారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటును వ్యతిరేకించే టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు మాటలు విని అచ్చెన్నాయుడు, కళా వెంకటరావు, అశోక్ గజపతి ఉత్తరాంధ్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని, అశోకగజపతి రాజుగా కాకుండా చంద్రబాబుకు బంటుగా వ్యవహరిస్తున్నారు’ అని అమర్‌నాథ్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటుపై రచ్చ చేస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి.