వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పురపాలకల్లో ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
ఈ జాబితాలో ఇటీవల రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం మనకు తెలిసిందే.
తాజాగా కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూడేళ్ల చిన్నారికి ఓటు హక్కు కల్పించారు అధికారులు.నందిత మెతుకు అనే మూడేళ్ల చిన్నారికి ఓటరు లిస్టులో 35 ఏళ్లుగా నమోదు చేశారు. చిన్నారి ఫొటో.. పేరు క్లీయర్ గా కనిపించడంతో ఈ ఓటర్ ఐడీ వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతుంది.