తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది.
పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు.
మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.