ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది.
దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
అయితే ఈ ప్రమాదంలో గాయాలతో బయటపడిన డ్రైవర్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అని సమాచారం. ఈ ప్రమాదం గురించి మరిన్నీ విషయాలు తెలియాల్సి ఉంది.