శృతి హాసన్ టాలీవుడ్ లో అగ్రహీరోలందరితో నటించింది. తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాను నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అయితే కొంతకాలం నుండి తనకు అవకాశాలు రాకో లేదా వేరే కారణం ఉందో తెలిదు గాని సినిమాలకు దూరంగా ఉంది. అనంతరం బ్రేక్ అప్ తరువాత ఇప్పుడు సినిమాలు వైపు మొగ్గు చూపుతుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తాను నటించిన పెద్ద సినిమాల్లో రేసుగుర్రం, గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, బలుపు లో గబ్బర్ సింగ్ అంటేనే తనకి స్పెషల్ అని చెప్పింది. ఇక మీడియా వారు తన చిన్నప్పటి క్రష్ గురించి అడిగితే ఆ టాపిక్ మార్చేసి హాలీవుడ్ హీరోలియనార్డో డికాప్రియోగా తన క్రష్ అని చెప్పింది.