రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఈ విషయంలో తాజాగా మరోసారి వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ వాళ్లకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.”ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటి కొస్తున్నాయి. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారు. సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుంది” అని ఛాలెంజ్ చేసారు.