రాజదానికి సంబంధించిన గ్రామాలలో టీడీపీ నాయకులు, బాబు వర్గం వారు భారీగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ,భూముల కుంభకోణం చేసి ఇప్పుడు ఇప్పుడు అవి ఎక్కడ బయట పడతాయో అని బయంతోనే చంద్రబాబు రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ మంత్రి ఎమ్.శంకర నారాయణ అన్నారు. వారిని చంద్రబాబు సొంత ప్రయోజనాల కోసం పావులుగా మార్చుతున్నారని అన్నారు.అక్కడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికోసమే జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు ని నమ్మి మోసపోవద్దని ఆయన చెప్పారు.