Home / ANDHRAPRADESH / బ్రేకింగ్…ఆ కేసులో పోలీసులకు లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..!

బ్రేకింగ్…ఆ కేసులో పోలీసులకు లొంగిపోయిన జేసీ దివాకర్ రెడ్డి..!

వివాదాస్పద టీడీపీ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఇటీవల అనంతపురంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ దివాకర్ రెడ్డి రెచ్చిపోయారు. పోలీసులు అధికార పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు అనుకూలమైన పోలీసులను తెచ్చుకుంటాం.. పోలీసుల చేత మా బూట్లు నాకిస్తా…గంజాయి కేసులు పెట్టి బొక్కలో తోయిస్తా అంటూ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలను ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఖండించింది. ఇక మాజీ సీఐ, హిందూపురం ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ పోలీసు బూట్లను ముద్దాడి పోలీస్ పవర్ ఏంటో చూపించి…జేసీ నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే..పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై అనంతపురం జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు త్రిలోక్‌నాథ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనంతపురం రూరల్ పోలీసులు జేసీ దివాకర్ రెడ్డిపై 153, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఈ కేసులో కోర్టు ఆదేశాలతో జేసీ దివాకర్ రెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సొంత పూచీకత్తుతో పాటు నెలకు రెండు సార్లు పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని జేసీకి న్యాయస్థానం షరతు విధించింది. మొత్తంగా ఏ పోలీసులపై జేసీ దివాకర్ రెడ్డి నోరుపారేసుకున్నాడో..అదే అనంతపురం పోలీసుల ముందు నిలబడి నెలకు రెండు సార్లు సంతకం పెట్టి రావాల్సి వచ్చింది. అందుకే అంటారు..నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే..ఆఖరకు ఇలా తిప్పలు పడాల్సి వస్తుందని..అయినా జేసీ వింటాడా..ఆయన రూటే సెపరేట్‌ మరి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat