గతంలో ఇచ్చిన హామీ మేరకు ఏపీ ప్రెస్ అకాడమీకి సీనియర్ జర్నలిస్టు ప్రముఖ సంపాదకులు దివంగత సీ. రాఘవాచారి పేరున నామకరణం చేస్తూ జీవో జారీ కావడం ఎంతో అభినందనీయమని, ఈవిషయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి, మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ గారికి ఐజేయూ , ఏపీయూడబ్ల్యూజే అర్బన్ లు ప్రకటనలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. గతంలో రాఘవాచారీ జర్నలిజంకోసం ఎంతో కృషి చేసారు. జర్నలిస్టులంతా ఆయన పేరు పెట్టినందుకు సీఎం కు కృతజ్ఞత తెలుపుతున్నారుమ్ కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో ఐజేయూ జాతీయ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్ అధ్యక్ష, కార్యదర్శలు చావా రవి, కొండా రాజేశ్వరరావు, విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు నిమ్మరాజు చలపతి రావు, ఆర్ వసంత్, స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (సామ్నా) అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు తదితరులు ఉన్నారు.
