ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటును వ్యతిరేకిస్తూ అమరావతిలో జరుగుతున్న ఆందోళనకు 18 వ రోజుకు చేరుకున్నాయి. మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అంటూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా మందడం, తుళ్లూరు, ఎర్రుబాలెం గ్రామాల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీసీ నేతలు మూడు రాజధానుల ఏర్పాటును స్వాగతిస్తున్నా….అధినేత చంద్రబాబు మాత్రం తన సామాజికవర్గ ప్రయోజనాల కోసమే అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలంటూ స్వార్థ రాజకీయాలు చేస్తున్నాడు. అమరావతి లేకుంటే చావే గతి అన్నట్లుగా రాజధాని రైతుల్లో భావోద్వేగాన్ని రగిలిస్తున్నాడు. ఆందోళనలను ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లేందుకు సకల జనుల పిలుపుకు అమరావతి రైతులు పిలుపునిచ్చారు. జనవరి 3 వ తేదీ శుక్రవారం నాడు మందడం గ్రామంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన గొడవలో కొందరు మహిళలు గాయపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా శనివారం నాడు అమరావతి బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే అమరావతి రాజధాని అనేది 29 గ్రామాల సమస్య కాదు..ఐదు కోట్ల మంది ఆంధ్రుల సమస్య అని నినదిస్తున్న ఆందోళన కారులు అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని, కర్నూలు, విశాఖలో రాజధానులు వద్దు అంటూ మొండిగా వాదిస్తున్నారు. కర్నూలులో హైకోర్ట్ పెడితే..రెండు జీరాక్స్ సెంటర్లు, నాలుగు టీ కొట్లు తప్పా..మరేమి డెవలప్ కాదని ఆందోళనకారులు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.. ఇప్పుడు అమరావతి బంద్ ప్రకటించారు. మరి అమరావతి 29 గ్రామాల సమస్య కాదు..రాష్ట్ర సమస్య అని చెప్పిన ఆందోళనకారులు కేవలం అమరావతి బంద్‌కు మాత్రమే పిలుపునిచ్చారు…అదేదో రాష్ట్రబంద్‌కు పిలుపునిస్తే.. అన్ని ప్రాంతాల ప్రజలు అమరావతిలోనే రాజధానికి మద్దతునిస్తున్నారని నిరూపించవచ్చు కదా…ఈ విషయాన్ని అమరావతి ఆందోళనకారులు కాని వారి వెంట ఉండి నడిపిస్తున్న చంద్రబాబు కాని చెప్పాలి. రాష్ట్ర బంద్‌కు కాకుండా..అమరావతిలోనే బంద్ చేస్తున్నారంటే..అమరావతి అవసరం ఒక్క 29 గ్రామాల ప్రజలకే కాని..మిగతా రాష్ట్రానికి అవసరం లేదని అర్థమవుతుంది. దీన్ని బట్టి అమరావతి నినాదంతో రాయలసీమలో, విశాఖలో అడుగుపెట్టే ధైర్యం..ఆందోళనకారులకు, చంద్రబాబుకు లేదని క్లియర్‌గా తెలిసిపొతుంది. దీంతో అమరావతి బంద్ కాదు బాబు…దమ్ముంటే అమరావతి రాజధాని కావాలని రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వు..అప్పుడు తెలుస్తోంది. బంద్ విజయవంతం అయితే.. సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి వెళతాడు..అదే బంద్ ఫెయిల్ అయితే…మూడు రాజధానులపై ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం అమరావతి మాత్రమే బంద్‌కు పిలుపునిచ్చారంటే..అమరావతికి 29 గ్రామాల్లో తప్పా.. మిగిలిన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్దతు లేదని అర్థమవుతుందని వైసీపీ నేతలు చంద్రబాబుకు ఛాలెంజ్ చేస్తున్నారు. నిజమే కాదా…ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు చంద్రబాబు.
