రాజధాని ప్రాంతంలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, ట్రేడింగ్‌కు పాల్పడ్డ టీడీపీ నాయకుల పేర్లు వారు కొనుగోలు చేసిన భూమి వివరాలతో సహా అన్ని విషయాలు అసెంబ్లీలో ఆర్దిక మంత్రి బుగ్గన బహిర్గతం చేసిన వైనం అందరికీ తెలిసిందే. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ తెలివిగా ఇన్ సైడ్ ట్రేడింగ్ ను రైతుల వైపు మళ్లించే యత్నం చేయసాగారు. ఇక ఈ ఇన్ సైడర్ విషయంలో ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు వేణుంబాక చురకలు అంటించారు.”ఇన్ సైడర్ ట్రేడింగులో తన వాళ్లు కొన్న భూముల విలువ పెంచడానికి రాజధాని గురించి చంద్రబాబు చేసిన హడివుడి అంతా ఇంతా కాదు. హైపర్ లూప్ రవాణా, బుల్లెట్ ట్రెయిన్ కనెక్టివిటీ…ఒలంపిక్స్ నిర్వహణ, అక్కడ నివసించే వారి ఆయుష్షు పదేళ్లు పెంచడం…లాంటి నమ్మశక్యం కాని కోతలెన్నో కోసాడు” అని అన్నారు.
