పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా కాసేపు పక్కనపెట్టి సినిమాలు విషయానికి వస్తే పవన్ సినీరంగంలో కొద్దిమంది తోనే సరదాగా ఉంటారు. ఆ లిస్టులో ముందుంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా సినిమాతో మొదలైన వీరి స్నేహం పవన్ చివరి సినిమాతో అది ప్లాప్ తో ముగిసింది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ ను కలిసాడు. దాంతో ఎక్కడా లేని అనుమాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పవన్ పింక్ రీమేక్ తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అన్నయ్య బాటలోనే సినిమాలు తీయనున్నడా అనే వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా త్రివిక్రమ్ తో మాట్లాడాడా అనే అనుమానాలు వస్తున్నాయి.
