పల్లెల ప్రగతి తో దేశాభివృద్ధికి నాంది అంటూ జాతిపిత మహాత్మా గాంధీ పిలుపు నిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరణలో అమలు పరుస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు గా నిలుస్తున్నప్పటికి ఏడూ దశాబ్దాలుగా గ్రామాలను ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.పల్లెప్రగతి రెండవ విడత కార్యక్రమాన్ని ఆయన శుక్రవారం సూర్యపేట జిల్లా పెన్పహాడ్ మండలం మాచారం గ్రామంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన 30 రోజుల అభివృద్ధి ప్రణాళికలో ప్రజలు ఎక్కడికక్కడ స్వచ్చందంగా భాగస్వామ్యం కావడంతో ఫలితాలు అద్బుతంగా వచ్చాయన్నారు.అదే స్ఫూర్తితో ప్రారంభిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో లక్ష్యాలను పూర్తి చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మీదటనే గ్రామాల అభివృద్ధి కి అంకురార్పణ జరిగిందన్నారు.నిధులు, విధులు ఏర్పాటు చేసి పల్లెలప్రగతి పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని ఆయన చెప్పారు.2014 కు పూర్వం అధికారంలో ఉన్న పాలకులు నిధులు మంజూరు చెయ్యకుండా విధులు అప్పగించకుండా తాత్పర్యం చెయ్యడం తోటే పల్లెలు ఇంతటి దౌర్భాగ్యాపు దుస్థితికి చేరుకున్నాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుపక్షపాతి అని రైతాంగాన్ని వ్యవసాయ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా మార్చేందుకు ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నారని ఆయన కొనియాడారు. అందులో బాగంగా నే తెలంగాణ లో సారవంతమైన భూములు ఉన్నట్లు గుర్తించిన ఆయన రైతులు ఏ ఏ పంటలు పండించగలరో నన్నది .నిపుణలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు.అదే సమయంలో ప్రజలు కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు సహకరించి పల్లెల ప్రగతిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.ప్రధానంగా గ్రామాలలో ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన స్మశాన వాటికలకు గాను అవసరమైన భూమి ని విరాళంగా అందించేందుకు దాతలు ముందుకు రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.పల్లెల ప్రగతికి పాత బావులు ,ములమలుపులలో పాత ఇండ్లు అడ్డుగా అనిపిస్తే సత్వరమే తొలగించుకోవలన్నారు.అంతే గాకుండా రహదారుల వెంట ఉన్న కంప చెట్లను తొలగించడంతో పాటు నీడనిచ్చే చెట్లను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలన్నారు.అదే సమయంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవలని ఉపదేశించిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రతి ఇంటి ముందు విధిగా ఇంకుడు గుంటలు నిర్మించుకోవలన్నారు.
పల్లెప్రగతిలో గ్రామాలు ఎలా ఉండాలి అని చెప్పేందుకు గ్రామాలకు తరలి వెడుతున్న అధికార యంత్రాంగం తాము పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలకు మంచి సందేశం అందించిన వారమౌతామన్నది విస్మరించకూడదని అధికారులకు ఆయన హితవు పలికారు.అనంతరం గ్రామంలో నిర్మిస్తున్న ఇంకుడుగుంటల,డంపింగ్ యర్డ్ నిర్మాణపు పనులను ఆయన పరిశీలించారు.ఇంకా ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సుందరి కిరణ్ కుమార్,జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డి ,సి ఇ ఓ విజయలక్ష్మి, డి పి ఓ యాదయ్య, జిల్లా వ్యవసాయఅధికారిణి కిరణ్మయి లతో పాటు జిల్లా ప్రజాపరిషత్ వైస్ చైర్మన్ వెంకట్ నారాయణ్ గౌడ్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,యం పి పి నెమ్మది బిక్షం,జడ్ పి టి సి మామిడి అనిత సర్పంచ్ సైదమ్మ,యం పి టి సి నాగునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 324