Home / SLIDER / అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో శుక్రవారం ఉదయం రూ.205లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు. అనంతరం మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి, అందే ఆరు గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు. వీరి వెంట దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, డీఈఓ రవికాంత్, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ఏంపీపీలు, జెడ్పిటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.కస్తూర్భా, మోడల్ స్కూల్ విద్యార్థుల తో ముచ్చటించిన మంత్రి. గత ఏడాది పదో తరగతి పరీక్షలలో మోడల్‌స్కూల్, కస్తుర్బా బాలికల ఫలితాలు‌ఎలా ఉన్నాయని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించిన మంత్రి.

పదో‌తరగతి పరీక్షలలో గత ఏడాది వంద శాతం ఫలితాలు‌ సాధించామన్న ప్రిన్స్ పాల్స్. అభినందనలు తెలిపిన మంత్రి.గ్రామంలో పల్లె ప్రగతి సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్ రావు.గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసిన మంత్రి.2 కోట్ల రూపాయలతో హాస్టల్ బిల్డింగ్ నిర్మించుకోవడం అభినందనీయం.10 వతరగతిలో 10/10 GPA సాధించిన విద్యార్థులకు రూ.25.000 నగదు బహుమతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందిస్తారు.రానున్న రెండు నెలలు విద్యార్థులు మనసుపెట్టి చదవాలి..ప్రతివిద్యార్థి యోగా చేయాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన ఈచ్ వన్ టీచ్ వన్ ను ఊరూరా అమలు చేసి సిద్ధిపేట జిల్లాను అక్షరాస్యతలో నెంబర్ 1 గా నిలపాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అక్షరాస్యతా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.

ఏంఈఓ, డీఈఓలు రెగ్యులర్ గా పాఠశాలలను విధిగా విజిట్ చేయాలి.10 వ తరగతిలో 100 శాతం రిజల్ట్స్ తేవాలి. అందరమూ కష్టపడి విద్యా వ్యవస్థను బాగు చేయాలి.మిషన్ భగీరథ నీరు గ్రామాల్లోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలి.పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్టర్ లను మంజూరు చేశారు..ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమైన స్వచ్ఛ తెలంగాణ సాధనకు అన్ని గ్రామాల సర్పంచ్ లు కృషి చేయాలి..ప్రతి గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రజా ప్రతినిధులు ప్రతిన బూనాలి..
నాటిన ప్రతి చెట్టును కాపాడాలి..ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించారు.త్వరలోనే దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలు రాబోతున్నాయి.కరువు అనే పదం ఇక మనం డిక్షనరీలో చూసినా కనిపించదు.గ్రామాల్లో యువత పనిలేకుండా ఉండొద్దు.యువత వ్యవసాయం పై దృష్టి సారించాలి..పనిచేసే వారికి అనేక అవకాశాలు ఉన్నాయి. ఆత్మ గౌరవంతో.. డిగ్నిటీ ఆఫ్ లేబర్ చేసే పనిలో సంపద గౌరవించి వెతకాలి. హైదరాబాద్ లో ఇతర రాష్ట్రాల వారు 5 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు.. తెలంగాణ యువత కూడా పనిచేయడానికి ముందుకు రావాలి అవకాశాల్ని ఉపయోగించుకోవాలి అని అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat