20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు వచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకుని వారి విడుదలకు కృషి చేశారు.
పాకిస్థాన్ విడుదల చేస్తున్న తెలుగు మత్స్యకారుల జాబితా ఇదే..!
*ఎస్.కిశోర్ , తండ్రి అప్పారావు
*నికరందాస్ ధనరాజ్, తండ్రి అప్పన్న
*గరమత్తి, తండ్రి రాముడు
*ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు
*ఎస్. అప్పారావు, తండ్రి రాములు
*జి. రామారావు, తండ్రి అప్పన్న
*బాడి అప్పన్న, తండ్రి అప్పారావు
*ఎం. గురువులు, తండ్రి సతియా
*నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య
*నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్
*వి. శామ్యూల్, తండ్రి కన్నాలు
*కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు
*డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి
*కందా మణి, తండ్రి అప్పారావు
*కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు
*శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు
*కేశం రాజు, తండ్రి అమ్మోరు
*భైరవుడు, తండ్రి కొర్లయ్య
*సన్యాసిరావు, తండ్రి మీసేను
*సుమంత్ తండ్రి ప్రదీప్.