Home / ANDHRAPRADESH / అమరావతిలో దారుణమైన కుట్రకు ఎల్లో బ్యాచ్ తెగబడుతుందా…?

అమరావతిలో దారుణమైన కుట్రకు ఎల్లో బ్యాచ్ తెగబడుతుందా…?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ..అమరావతి రైతులు గత రెండువారాలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు తన సామాజికవర్గానికి చెందిన వారి భూములకు విలువ పడిపోతుందనే భయంతో అమరావతి రైతులను రెచ్చగొడుతూ…వారిని మరింత భయాందోళనలకు గురి చేస్తున్నాడు. అయితే ఎక్కడైనా ప్రాణం పోయినా మా భూములు ఇవ్వమనే రైతులను చూస్తాం కానీ.. మా భూములు మాకు వద్దు..రాజధానే కావాలనే రైతులను అమరావతిలో చూస్తుండడం విచిత్రాలలో కెల్లా విచిత్రం. ప్రభుత్వం రాజధానిని పూర్తిగా తరలించడం లేదని చెబుతున్నా రైతులు వూరుకోవడం లేదు..అమరావతిలో అసెంబ్లీ ఉంటుందని, ఎడ్యుకేషనల్ హబ్‌గా రాజధాని స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం హామీ ఇస్తున్నా…అమరావతి రైతులు మాత్రం వైజాగ్, కర్నూలులో రాజధానులు వద్దు.. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని మొండిపట్టు పడుతున్నారు. మా భూములు పోయినా ఫర్లేదు…రాజధాని మాత్రం ఇక్కడే ఉండాలని అమరావతి రైతులు వితండవాదం చేస్తున్నారు. రాజధాని తరలిపోతే మీ జీవితాలు ఆగమైపోతాయని చంద్రబాబు ఓ రకమైన భయాందోళనలను అమరావతి రైతుల మైండ్‌‌లోకి ఎక్కిస్తున్నాడు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతే.. చావే గతి అన్న భావన రైతుల్లో మెల్లగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు రైతులు అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉంచాలని, లేకుంటే తమకు మెర్సీకిల్లింగ్‌కు అనుమతివ్వండి అంటూ ఏకంగా రాష్ట్రపతికే లేఖలు రాసేందుకు సిద్ధమవడం కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్యల ఆలోచనల వెనుక ఎల్లో బ్యాచ్ పెద్ద కుట్ర చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

రాజధానిలో ఎంతగా ఆందోళనలు చేయిస్తున్నా ..రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు..దీంతో ఎల్లో బ్యాచ్ అమరావతి లేకపోతే అసలు బతుకే లేదని… ఒక సామాజికవర్గ రైతుల్లో భావోద్వేగాలను రేకిత్తిస్తోంది . ఒకవేళ మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం ముందడుగు వేస్తే..కొందరు సున్నితమనస్కులైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే..దాన్ని జాతీయ స్థాయిలో రచ్చ  చేసేందుకు ఎల్లో బ్యాచ్ కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఇదే విషయంపై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో బీజేపీ నేత చిట్టిబాబు స్పందించారు. ఇంత కాలం ప్రాణం పోయినా తమ భూములు ఇవ్వబోమని చెప్పే రైతులను చూశాం కానీ.. మా భూములు వద్దు…రాజధానే కావాలి… అందుకు ప్రాణమైనా ఇస్తామంటున్న రైతులు ఒక్క అమరావతిలో మాత్రమే కనిపిస్తున్నారని  చిట్టిబాబువ్యాఖ్యానించారు. ఇది పూర్తిగా పథకం ప్రకారం జరుగుతుందని, రియల్ ఎస్టేట్ మాఫియా, ఒక పార్టీ నేతలు అమరావతి లేకపోతే చావే శరణ్యమనే భావోద్వేగాలను రగలిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో మరో దుర్మార్గమైన ఆలోచన కూడా చేస్తున్నారని చిట్టిబాబు వివరించారు. కొందరు ఆత్మహత్యలు చేసుకునేలా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని వెల్లడించారు. ఈమేరకు తమ పార్టీ నేతలకు సమాచారం అందుతుందని చిట్టిబాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ పెద్దలే.. కొందరిని ఎంపిక చేసి వారిలో నలుగురైదుగురు ఆత్మహత్యలు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారని వివరించారు. ఆ ఆత్మహత్యల పేరుతో రాజకీయ లబ్ది పొందే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారని… ఈ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని చిట్టిబాబు హెచ్చరించారు. కాగా టీడీపీ నేతలు హత్యలు చేసి ఆత్మహత్యలుగా చూపించగల సమర్ధులు అంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా టీవీ డిబెట్‌లో పాల్గోన్నవారు గుర్తు చేశారు. మొత్తంగా అమరావతిలో జరుగుతున్న ఆందోళలను జాతీయ స్థాయిలో ప్రొజెక్ట్ చేసేందుకు..ఎల్లో బ్యాచ్ రంగంలోకి దిగిందని..అందుకే క్షణక్షణం రాజధాని తరలిపోతుందంటూ పచ్చకథనాలతో రైతులను మానసిక భయాందోళనలకు గురి చేసి వారు ఆత్మ‌హత్యలకు పురికొల్పేలా కుట్ర చేస్తుందని తెలుస్తోంది. శవ రాజకీయం చేయడంలో టీడీపీ తర్వాతే ఎవరైనా…అందుకే ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులను గమనిస్తూ..వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat