టీడీపీ గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలే కనిపించాయి. చివరికి చంద్రబాబును నమ్మి ఓటు వేసినందుకు వారినే నట్టేటిలో ముంచేశారు. మరోపక్క ఇదేమి న్యాయం అని అడిగినందుకు పోలీసులతో కొట్టించారు. ఇలా ఈ ఐదేళ్ళు రౌడీ పాలనే జరిగిందని చెప్పాలి. అయితే వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి దీనిపై ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు.”నిప్పుల కుంపటి కాదు చంద్రబాబూ. ఐదేళ్ల మీ పాలనలో దోపిడీ, అరాచకాలకు అంతేలేదు. రావణ కాష్టంలా మండించావు రాష్ట్రాన్ని. అందుకే ప్రజలు తరిమి కొట్టారు. అమరావతి చుట్టూ 4 గ్రామాల్లో మొసలి కన్నీరు కురిపిస్తూ పగటి వేషగాడిలా మారిపోయావు. రియల్ ఎస్టేట్ దళారి స్థాయికి దిగజారి పోయావు” అని అన్నారు.
