ఈ ఏడాది ఫిబ్రవరి ఐదో తారీఖున సారలమ్మ ,గోవిందరాజుల రాకతో మేడారం జాతర ప్రారంభం కానున్న సంగతి విదితమే. ఆ తర్వాత ఎనిమిదో తారీఖున వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
మేడారం జాతరకు సంబంధించి జరుగుతున్న పనులను పరిశీలించడానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ ,సత్యవతి రాథోడ్ ,ఎంపీ మాలోత్ కవిత,ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగరంలోని బేగంపేట విమానశ్రయం నుండి బయలు దేరి వెళ్లారు.
అక్కడకి చేరుకున్నాక మహా జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు సమీక్షించారు. అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు.. అధికారులకు పలు సూచనలు చేశారు. జంపన్నవాగులో ఏర్పాటు చేసిన బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్‌ను ప్రారంభించారు. అక్కడ ఉన్న స్నానఘట్టాలను మంత్రులు పరిశీలించారు. అంతకుముందు సమ్మక్క, సారలమ్మను మంత్రులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.