రాష్ట్రంలో ఏ వ్యాధికైనా వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వ్యక్తికి ఉచితంగా చికిత్స అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలకు వైఎస్ జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో మరో వేయి వ్యాధులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందించే కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించారు.
గతంలో ఉన్నవాటికి అదనంగా 1000 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీ కింద మొత్తం 2059 రోగాలకు చికిత్స అందించే కార్యక్రమాన్ని ఏలూరులో ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో 1059 చికిత్సలకి అదనంగా 200 చికిత్సలు చేర్చి మొత్తంగా 1259 చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ఏప్రిల్ నుంచి నెలకు ఒక జిల్లా చొప్పున 2059 చికిత్సలకి ఆరోగ్యశ్రీ వర్తింప చేయనున్నారు. ఫిబ్రవరి 1 నుంచి అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి రానున్నాయి.5వేల హెల్త్ సబ్ సెంటర్లకు జనవరిలోగా టెండర్లు ఖరారు చేయనున్నారు.
జనవరి 3న కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని సీఎం అన్నారు. ఆరోజు 1.5 లక్షల కార్డులు పంపిణీ చేస్తున్నామన్న అధికారులు. తలసేమియా, సికిల్ సెల్‌ఎనీమియా, హిమోఫిలియా రోగులకు రూ.10వేల చొప్పున పెన్షన్.. ప్రమాదానికి గురై మంచానికే పరిమితమైన వారికి లేదా వీల్ చైర్ కి పరిమితమైన వారికి, బోదకాలు, కండరాల క్షీణతతో బాధపడుతున్నవారికి, పక్షవాతం తో బాధపడుతున్న వారికి నెలకు రూ.5వేల చొప్పున పెన్షన్.. లెప్రసీ వ్యాధితో బాధపడుతున్నవారికి రూ. 3వేల పెన్షన్.. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నవారికి ( స్టేజి 3, 4 &5) కిడ్నీ, లివర్, గుండె మార్పిడి చేయించుకున్నవారికి రూ.5వేల చొప్పున పెన్షన్.. జనవరి చివరినాటికి 5వేల సబ్‌సెంటర్ల నిర్మాణాలకు సంబంధించి టెండర్లు ప్రజలకు అందుబాటులో ఉండేలా సబ్‌సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు..