ఏపీ అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు ఉంటాయోమో అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతన్నాయి. తాజాగా ఏపీలో మూడు రాజధానులపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్ జగన్ . వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమంలో పాల్గొన్న జగన్ .. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలకు మేలు చేసేలా నిర్ణయాలుంటాయని తెలిపారు. గత ప్రభుత్వం కొందరికే న్యాయం చేసింది.. మా దృష్టిలో మూడు ప్రాంతాలు సమానమని స్పష్టం చేసిన వైఎస్ జగన్.. గత ప్రభుత్వం అన్యాయంగా నిర్ణయాలు తీసుకుంది.. గత అన్యాయాలను సరిదిద్దుతామని అన్నారు. అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు ఉండేలా చూస్తామని , ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా.. అందరి అభివృద్ధి కోసం అధికారాన్ని వినియోగిస్తామని న్న సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
