ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు స్కెచ్ మామోలిది కాదని చెప్పాలి. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించడం ఏదో టీడీపీ నాయకులకు, చంద్రబాబు కులస్తులకు ఏదో కల వచ్చినట్టు ముందుగానే అక్కడ భూములు కొనుగోలు చేయడం వంటి విషాయల వల్ల అందరికి అనుమానాలు వచ్చాయి. అయితే ఇక తాజాగా అమరావతిపై బాబుకు సాక్షి టీవీ ఫోర్త్ ఎస్టేట్ చర్చలో వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ సూటి ప్రశ్నలు వేసారు.వాటిని చూసుకుంటే..!
- ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో లింగమనేని ఎస్టేట్ గ్రూప్ కు చెందిన 804 ఎకరాలు , రామకృష్ణ హౌసింగ్ సొసైటీ చెందిన 179 ఎకరాలు , అప్పటి టీడీపీ ఎమ్యెల్యే కొమ్మలాపాటి అభినందన గ్రూప్ కు సంబందించిన 43 ఎకరాలు ఎందుకు తప్పించారు ?
- 2014 జులై 7వ తేదీన కంతేరులో లింగమనేని గ్రూప్ దగ్గర నుండి హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ భూములు కొనుగోలు చేసింది నిజం కాదా? ఆ భూములు కొన్నారా? గిఫ్టా ? లేదా లంచమా?
- చంద్రబాబు ప్రతిపాదించిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రక్కనే హెరిటేజ్ భూములు , మురళి మోహన్ జయభేరి భూములు ఎలా ఉన్నాయి?
- ఎస్సి , ఎస్టీ , బిసి అసైన్డ్ భూములపై కొనుగోలు , అమ్మకాలు జరగకూడదు అని చట్టలున్న రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ఎవరు కొన్నారు?
- జీవో-1 పేరుతో జనవరి 1 2015 రిలీజ్ చేసిన దాని ప్రకారం అసైన్డ్ భూములను పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటుంది అని ప్రచారం చేసి , టీడీపీ బినామీ నాయకులు అసైన్డ్, లంక భూములను కొన్న తర్వాత ఫిబ్రవరి 17 2015 జీవో-41 ద్వారా పరిహారం చెల్లించాలని చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వలన లాభం పొందింది అసలైన దళిత రైతులా ? లేదా కొనుగోలు చేసిన బాబు కులస్థులా?
- ఫ్లాట్లు కేటాయింపులో దళితులపై వివక్ష చూపింది నిజం కాదా? శ్మశానల ప్రక్కన , డంపింగ్ యార్డుల ప్రక్కన దళితులకు ఫ్లాట్లు కేటాయించి, బాబు బినామిలకు విలువైన ప్రాంతాల్లో కేటాయించిన మాట వాస్తవం కాదా?
- అమరావతి ప్రాంతంలో ఎకరా 4 కోట్లు ప్రాథమిక ధరగా నిర్ణయించి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అదే ధరలో భూమికి కేటాయించి బినామీ సంస్థలకు పప్పు బెల్లాలకు భూములు పందేరం చేసిన మాట వాస్తవం కాదా?
- మెడికల్ సిటీ నిర్మిస్తాం అని 2016 లో ఒక సంస్థలో ఒప్పందం కూర్చుకొని 100 ఎకరాలు కేటాయించి 2018 లోపు నిర్మాణాలు పూర్తిచేయాలని జీవోలో పేర్కొన్న నేటికి ఒక్క ఇటుక పడకపోవడాన్ని ఎలా చూడాలి?