Home / ANDHRAPRADESH / చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!

చంద్రబాబు సతీమణి గాజుల త్యాగానికి డిప్యూటీ సీఎం కౌంటర్..!

సంక్షోభంలో కూడా మైలేజీ కోసం పాకులాడే రాజకీయ నాయకుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా…అమరావతిలో గత రెండు వారాలుగా జరుగుతున్న రైతుల ఆందోళనలను తనకు అనుకులంగా మార్చుకోవడానికి చంద్రబాబు రంగంలోకి దిగాడు. ఒకపక్క మూడు రాజధానులను రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు స్వాగతిస్తుంటే..చంద్రబాబు మాత్రం మూడు రాజధానుల వద్దు..అంటూ అమరావతి ముద్దు అంటూ..రాజధాని రైతులను రెచ్చగొడుతూ…రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నాడు. రాజధాని ఆందోళనల్లో మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు..ఇంకేముంది బాబుగారి బుర్ర పాదరసంలా పని చేసింది. వెంటనే తన భార్యామణి నారా భువనేశ్వరిని రంగంలోకి దింపి సెంటిమెంట్ పండించారు. ఆదివారం నాడు సతీసమేతంగా బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని దర్శించుకుని మరీ వచ్చి అమరావతి గ్రామాల్లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కాసేపు తన సొంత డబ్బా కొట్టుకుని ఆ తర్వాత తన భార్య భువనేశ్వరీతో మాట్లాడించారు. పాపం పెద్దావిడ ఏనాడు పబ్లిక్ మీటింగ్‌లలో మాట్లాడి ఎరుగదు..ఏదో హెరిటేజ్ వ్యాపారాలు,ఇంటి వ్యాపకాలు తప్పా…రాజకీయాల్లో పెద్దగా జోక్యం చేసుకోదు..అలాంటిది కేవలం బాబుగారి దిక్కుమాలిన రాజకీయం కోసం మైకు పట్టుకోవాల్సి వచ్చింది..‎మీ కోసమే చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారంటూ భువనేశ్వరీ గారు సెంటిమెంట్ రగిలించారు. చంద్రబాబు గారు ఉన్నంతవరకు మీ భూములు ఎక్కడకు పోవు అంటూ భరోసా ఇచ్చారు..మీ కష్టం చూడలేకపోతున్నానంటూ.. రాజధానిలో జరుగుతున్న ఆందోళనకు మద్దతుగా తన గాజులు తీసి ఇచ్చారు…అయినా బంగారు బాతులాంటి అమరావతి తరలిపోతుంటే…ఆఫ్ట్రాల్ రెండు బంగారు గాజులు పోతే ఏంటీ అనుకున్నారేమో…తన గాజులు తీసి మహిళలకు ఇచ్చారు. అంతే… మా బాబు గారి భార్య గాజుల త్యాగానికి రాజధాని మహిళలు ఉద్వేగంతో కదలిపోయారని ఎల్లోమీడియా ఊదరగొట్టింది. అయితే బంగారు గాజులు త్యాగం చేసిన నారాభువనేశ్వరికి ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. అసలు రాజధాని రైతులకు భువనేశ్వరి పంచాల్సింది బంగారు గాజులు కాదని.. మీ భర్త చంద్రబాబు హయాంలో అన్యాయంగా రైతుల దగ్గర నుంచి లాక్కుల భూములని కౌంటర్ ఇచ్చారు. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరు తో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా. అని ప్రశ్నించారు. వెంటనే హెరిటేజ్ పేరుతో రాజధానిలో కొన్న 14.22 ఎకరాల భూములను భువనేశ్వరి వెంటనే వాటిని రైతులకు ఇచ్చేయాలని పుష్ఫ శ్రీవాణి డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అమరావతి ప్రాంతాల్లో రాజధాని పేరుతో 4వేల ఎకరాలు దోచుకుంది నిజం కాదా అని ఫైర్ అయ్యారు. బంగారు గాజులతో పాటు ఆ 4 వేల ఎకరాలు కూడా రైతులకు ఇచ్చేస్తే అంతకంటే మేలు చేసిన వారు అవుతారని ఎద్దేవా చేశారు. మొత్తంగా భార్య పేరుతో సెంటిమెంట్ రగలించి, రాజకీయలబ్ది పొందాలనుకున్న చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat