Home / ANDHRAPRADESH / బిగ్ బ్రేకింగ్.. ట్రాన్స్‌కాయ్ అవినీతి బాగోతం.. 250 కోట్ల కుంభకోణంలో టీడీపీ పెద్దలు..?

బిగ్ బ్రేకింగ్.. ట్రాన్స్‌కాయ్ అవినీతి బాగోతం.. 250 కోట్ల కుంభకోణంలో టీడీపీ పెద్దలు..?

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు‌కు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థపై సీబీఐ దాడుల నేపథ్యంలో 250 కోట్ల భారీ అవినీతి కుంభకోణం బయడపడడం రాజకీయంగా పెను సంచలనం రేపుతోంది. ట్రాన్స్‌కాయ్ సంస్థ చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో హెడ్‌వర్క్స్‌ పనులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పట్లోనే రాయపాటికి చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ శక్తి సామర్థ్యాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పోలవరం లాంటి భారీ ప్రాజక్టును నిర్మించే నైపుణ్యం, సమర్థత ట్రాన్స్‌కాయ్‌కు లేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే చంద్రబాబు మాత్రం ట్రాన్స్‌కాయ్‌ సంస్థను వెనుకేసుకు రావడమే కాకుండా భారీగా ఎస్టిమేషన్లు పెంచేసి రాయపాటికి భారీగా లబ్ది చేకూర్చారని, ప్రతిగా 500 కోట్లు కమీషన్లు కొట్టేశారని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ తీవ్ర విమర్శలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ట్రాన్స్‌కాయ్ నత్తనడక పనులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వీలైతే టెండర్లను వేరే కంపెనీకి అప్పగించమని బాబు సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పాత కాంట్రాక్టులను రద్దు చేసి రివర్స్ టెండరింగ్‌ ద్వారా వేరే కంపెనీలకు పోలవరం నిర్మాణ పనులను అప్పగించింది. ఇదిలా ఉంటే తాజాగా రాయపాటి ఇళ్లలో, ట్రాన్స్ కాయ్ కార్యాలయాల్లో ఏక కాలంలో సీబీఐ సోదాలు నిర్వహించిన సందర్భంగా 250 కోట్ల భారీ స్కామ్‌ బయటపడిందని విశ్వసనీయ సమాచారం. వేల కోట్ల రూపాయల పనులు చేసే సీన్ లేకపోయినా ట్రాన్స్‌కాయ్ సంస్థకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు పోలవరం టెండర్లు కట్టబెట్టారు. దీంతో ఈ పోలవరం కాంట్రాక్టును చూపించి రాయపాటి ఏకంగా 14 బ్యాంకుల కన్సార్షియం ద్వారా వేల కోట్లు అప్పుగా తీసుకున్నారే కాని తిరిగి చెల్లించలేదు. ఇలా వివిధ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు దాదాపు రూ. 795 కోట్లు ఎగ్టొట్టారు. అయితే రాయపాటి సంస్థకు చెల్లించాల్సిన బిల్లులను ప్రభుత్వం బ్యాంకుల కన్సార్షియంలోని ఏదో ఒక బ్యాంకులో జమ చేయాలి..అప్పుడు బ్యాంకులు తమకు రావల్సిన డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులను సదరు నిర్మాణ సంస్థ అకౌంట్‌లో వేస్తాయి. ఇక్కడే రాయపాటి, చంద్రబాబు తెలివిగా వ్యవహరించారు. రాయపాటి సంస్థకు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని బాబు సర్కారు కన్సార్షియంలోని బ్యాంకులో కాకుండా రాయపాటి చెప్పిన ఇంకేదో బ్యాంకులో జమ చేసింది. అలా రాయపాటి బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి ప్రజల సొమ్మును తేరగా కొట్టేశారు. తాను చెప్పినట్లుగా కన్సా‍ర్షియంలోని బ్యాంకులో కాకుండా వేరే బ్యాంకులో బిల్లుల మొత్తాన్ని వేసినందుకుగాను.. రాయపాటి టీడీపీ పెద్దలకు ఏకంగా 250 కోట్లు ముడుపుల రూపంలో చెల్లించినట్లు సీబీఐ సోదాల్లో తేలిందంట. . దీంతో రాయపాటి చెల్లించిన ఆ 250 కోట్లు పెదబాబు బినాబీ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయినట్లు తెలుస్తోంది. మొత్తంగా రాయపాటిపై సీబీఐ సోదాల నేపథ్యంలో బయటపడిన 250 కోట్ల ముడుపుల బాగోతం ఇప్పుడు ఏపీ రాజకీయ, అధికారవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. మరి ఆ 250 కోట్లు అందుకున్న పెదబాబు ఎవరనేది సీబీఐ ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat