కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్ రామానాయుడిపై టీడీపీ నాయకుడు దబ్బల రామాంజిని కుమారుడు సతీష్ ఒక్కసారిగా పిడిబాకుతో దాడి చేసి పరారయ్యాడు. తీవ్రగాయాలై రక్తపుమడుగులో రామానాయుడు కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు 108 వాహనంలో పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సతీష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తుగ్గలి ఏఎస్ఐ మాధవస్వామి తెలిపారు. నిందితుడు సతీష్ డోన్‌లోని డిగ్రీ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. నవశకం కార్యక్రమంలో భాగంగా వలంటీర్ రామానాయుడు కూడా ఇంటింటి సర్వే చేశాడు. ఆ సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో తన పేరు లేకుండా చేశావంటూ సతీష్ 20 రోజుల క్రితం వలంటీర్‌తో గొడవకు దిగాడు. తాను సర్వే మాత్రమే చేశానని, పేరు తీసేసే హక్కు తనకు లేదని చెప్పాడు. ఆ తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పేరు ఎలాగూ వచ్చింది. అయినా కక్ష పెంచుకున్న సతీష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. అయితే గ్రామవలంటీర్పై హత్యాయత్నం ఘటనతో రాంపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో 400 ఓట్లకు పైగా వైసీపీకి మెజార్టీ రావడంతో టీడీపీ వర్గీయులు జీర్ణించుకోలేక పోతున్నారు. రానున్న సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ గెలవకుండా చేయాలని వారు ప్లాన్‌లో ఉన్నట్లు వైసీపీ మద్దతుదారులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నాయకుడి కుమారుడు గ్రామ వలంటీర్‌పై హత్యాయత్నానికి పాల్పడడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
Tags attack constituency Pathikonda pattikonda tdp leader village volunteer
Related Articles
నువ్వు హీరోవా….రౌడీవా…బొచ్చులోది…గెటవుట్…బాలయ్యపై టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..!
September 23, 2023
.జైలు నుంచే బాలయ్యకు చంద్రబాబు వెన్నుపోటు..బ్రాహ్మణి భజన చేస్తున్న పచ్చ సాంబడు..!
September 23, 2023
జడ్జి హిమబిందుపై టీడీపీ నేతల కారుకూతలపై రాష్ట్రపతి భవన్ సీరియస్..కఠిన చర్యలకు ఆదేశాలు..!
September 23, 2023
నీ బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అయితే మాకేంటీ..ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ..జాగ్రత్త బాలయ్య..!
September 21, 2023
వైఎస్సార్సీపీ గుర్తు అయినంత మాత్రాన జైలులో ఫ్యాన్ వాడకుంటే దోమలు కుట్టవా బాబుగారు..!
September 21, 2023
చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్‌కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
September 19, 2023
హైదరాబాద్‌లో టీడీపీ కమ్మోళ్లే కాదు..జగన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారబ్బా..దెబ్బకు దెబ్బ అంటే ఇదే..!
September 19, 2023
జగన్ కేసీఆర్‌లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
September 16, 2023
చంద్రబాబుకు మళ్లీ షాక్ ఇచ్చిన ఏసీబీ కోర్డ్..రెండు బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా..!
September 15, 2023
జూనియర్ ఎన్టీఆరా..వాడో ఓ పిల్ల సైకో…కులపోళ్లతో తిట్టిస్తున్న పచ్చమీడియా..ఇది నారా కుట్ర..!
September 15, 2023
ఏఏజీ పొన్నవోలుని చెప్పుతో కొట్టిస్తా..నా కొడకా..అని తిట్టించిన టీవీ 5 పచ్చ సాంబడు..!
September 15, 2023