అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు కాదు కదా అని వూరుకున్నారు…ఇప్పుడు అమరావతే మునిగిపోయే పరిస్థితి వచ్చేసరికి నా దగ్గరకు వచ్చారు..కరెంట్ తీగను పట్టుకోవద్దు అంటే వినలేదు ఇప్పుడు చూడండి ఏమైంది… మీరు తప్పుచేసి నన్ను పోరాడమంటున్నారు అంటూ ప్రజలపై కూడా విరుచుకుపడ్డారు. అంతే కాదు వైయస్‌కే భయపడలేదు..జగన్‌కు భయపడతానా అంటూ బాబు ఓ రేంజ్‌లో రెచ్చిపోయాడు. అయితే చంద్రబాబు విమర్శలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ చరిత్ర అందరికీ తెలుసని, ఆయన రాజకీయ ఎదుగుదలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కారణమని అన్నారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చంద్రబాబుకు వైఎస్సార్ అన్నివిధాలుగా మేలు చేశారని, ఆయన మంత్రి అవ్వడానికి కూడా కారణం వైఎస్సార్ అని తెలిపారు. అలాంటిది చంద్రబాబును చూసి వైఎస్సార్ భయపడాల్సిన అవసరం ఏముందని, బహుశా ఆయన ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమోనని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనతో రాష్ట్రం మరో ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరీ అమరావతి రైతుల ఉద్యమానికి చేయూతగా రెండు బంగారు గాజులు ఇచ్చిన విషయంపై మంత్రి బొత్స మాట్లాడుతూ…ఇవ్వాల్సింది రెండు గాజులు కాదని రైతుల దగ్గర లాక్కున్న భూములని కౌంటర్ ఇచ్చారు. మొత్తంగా మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రభుత్వం అధికారికంగా ప్రకనట చేయకముందే…అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి.
