తెలంగాణ రాష్ట్రం.. ప్రభుత్వంపై భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. వికీపీడీయా ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉప రాష్ట్రపతి అభినందించారు.
నేటి సమాచార సాంకేతిక యుగంలో మన చరిత్ర,గొప్పదనాన్ని,నేటి రాబోవు యువతరానికి తెలియజేయాలనే లక్ష్యంతో తెలుగు వికీపీడియా వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు.
తెలుగు భాష,ఆస్తిత్వం కొనసాగాలంటే మన చరిత్ర,భౌగోళిక ,రాజకీయ ,ఆధ్యాత్మిక ,సంస్కృతి సంప్రదాయ ఆచరాలు,సాహిత్యం ,కళలు వంటి అంశాలను భవిష్యత్ తరాలకు అందేందుకు ఈ సమాచారమంతా తెలుగులో అందుబాటులోకి రావాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.