మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలోకి ఎంట్రీవ్వబోతున్నాము. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరిగిపోతున్నాయి. అయితే కొత్త ఏడాదిలో మొదటి నెల జనవరిలో పదహారు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి అని వార్తలు వస్తున్నాయి.
ఇందులో భాగంగా జనవరి నెలలో 1,2,5,7,8,11,12,14,15,16,17,19,23,26,30తేదీలతో పాటుగా ఆదివారాలు,2,4 శనివారాలు బ్యాంకులకు ఎలాగూ సెలవులున్నాయి.
కాబట్టి బ్యాంకుల వినియోగదారులు తమ తమ లావాదేవీలను ఇతర తేదీలల్లో నిర్వహించుకుంటే మంచిది. అయితే ఇందులో కొన్ని సెలవులు దేశంలోని కొన్ని రాష్ట్రాలకే పరిమితమవ్వడంతో ఖాతాదారులు మీ మీ బ్యాంకులను ఒకసారి సంప్రదిస్తే మేలు.