తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్కే జోషి ఈ రోజుతో ఆ పదవీ నుండి తప్పుకోనున్న సంగతి విదితమే. పదవీ కాలం ముగియడంతో ఎస్కే జోషి పదవీ విరమణ చేయనున్నారు. ఈ రోజు మంగళవారం రిటైర్ కాబోతున్న ఎస్కే జోషిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి జోషి నీటి పారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహారించనున్నాడు.
అయితే నూతన ప్రభుత్వ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించింది. దీనికి సంబంధించిన ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. సోమేష్ కుమార్ 1989 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.ఈయన పదవీకాలం 2023 డిసెంబర్ 31 వరకు ఉంది.