ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ రాజధాని గ్రామాల్లో జరుగుతున్న ఆందోళననలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వం వహిస్తున్నాడు. తాజాగా జర్నలిస్టులపై దాడి కేసులో అరెస్ట్ అయిన రైతులను చంద్రబాబు జైలుకు వెళ్లి మరీ పరామార్శించాడు. సదరు రైతులు బెయిల్‌పై విడుదలైతే టీడీపీ నాయకులు పెద్ద ర్యాలీలతో హడావుడి చేశారు. అయితే అమరావతి ఆందోళనలను టీడీపీ నిర్వహిస్తుందనే ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు ఇతర పార్టీల్లోని తన సామాజికవర్గానికి చెందిన నేతలను రంగంలోకి దింపాడు..బాబుగారి సామాజికవర్గానికే చెందిన ఎర్ర పార్టీల నేతలు సీపీఎం రాఘవులు, సీపీఐ నారాయణలు కమ్మగా అమరావతి పాట పాడుతున్నారు. తాజాగా బాబుగారి సామాజికవర్గానికే చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రంగంలోకి దిగింది. తుళ్లూరులో జరిగిన ఆందోళన దీక్షకు ఏపీ కాంగ్రెస్ మహిళా నాయకురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం ప్రకటించింది. ఈ సందర్భంగా చెప్పు చూపిస్తూ…చెప్పు దెబ్బలు తింటావు జగన్‌మోహన్ రెడ్డి అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంది.
సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుంకర పద్మశ్రీపై వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి ఎన్.పద్మజ విరుచుకుపడ్డారు. రాజధానిలో ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల రాజకీయాలకు ప్రతిపక్ష నేత చంద్రబాబు తెర లేపుతున్నారని ఫైర్ అయ్యారు. ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధానికి చంద్రబాబు అనుకూలమో? వ్యతిరేకమో సమాధానం చెప్పాలన్నారు. కేవలం చంద్రబాబు మెప్పు కోసమే సుంకర పద్మ సంస్కారహీనంగా, వంకరమాటలు మాట్లాడుతుందని వైసీపీ నేత పద్మజ నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలపై అరాచకాలు, అత్యాచారాలు విపరీతంగా జరిగినప్పుడు ఈ వంకర పద్మశ్రీ ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు. రాజధాని భూ కుంభకోణంలో లోకేష్, సుజానాచౌదరికి బినామీ పేర్లతో భూములు లేవా అని ప్రశ్నించారు. సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని, ఇకనైనా సుంకర పద్మ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని పద్మజ హెచ్చరించారు. మొత్తంగా సీఎం జగన్‌పై సుంకర పద్మశ్రీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు.