2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే..!
* సచిన్ టెండూల్కర్ – వంద అంతర్జాతీయ సెంచురీలు చేసిన మొదటి ఆటగాడిగా చరిత్ర నిలిచాడు.
*మహేంద్రసింగ్ ధోని – మూడు ఐసీసీ ట్రోపీలను గెలిచిన మొదటి కెప్టెన్
*రోహిత్ శర్మ – అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు (264).
*విరాట్ కోహ్లి – ఒక క్యాలండర్ ఇయర్ లో 10కి పైగా సెంచురీలు సాధించిన కెప్టెన్.