తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు.. సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో 2019 లో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాదించామని గుర్తు చేశారు.
ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అన్ని రంగాల్లో రాష్ట్రాన్నీ పురోభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలుపుతాం అన్నారు.. గత ఏడాది అంతా సుఖ సంతోషాలతో గడిచినట్లే….ఈ ఏడాది మీ కుటుంబాలు సుఖ శాంతులతో విలసిల్లాలని కోరుతున్నా. ముఖ్యంగా విద్యార్థులు, యువత నూతన లక్ష్యాలు పెట్టుకోండి.
అలక్ష్యాలను అందుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకోండి. వచ్చే ఏడాది నాటికి వాటిని మీరు చేరుకునేలా కష్ట పడండి. 2019 వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ…2020 లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని కోరుతూ…అందరికీ ” హ్యాపీ న్యూ ఇయర్ “అని అన్నారు.