చంద్రబాబు హయాంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ పోలవరంలో ప్రధాన టెండర్లను చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ట్రాన్స్‌కాయ్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్లు, చంద్రబాబు ఎస్టిమేషన్లను భారీగా పెంచేసి, ట్రాన్స్‌కాయ్‌కు లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా భారీగా కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులో రాయపాటికి చెందిన నివాసాల్లో, ఆఫీసుల్లో ఉదయం నుంచి ఏకకాలంలో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. రాయపాటికి చెందిన ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీ రూ. 300కోట్ల మేర బ్యాంకు రుణాలు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా ఎగవేసినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీపై కేసు నమోదు చేసిన అధికారులు ప్రధాన కాలయంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. పోలవరంలో ట్రాన్స్‌కాయ్ నిబంధనలకు వ్యతిరేకంగా అవినీతికి పాల్పడినట్లు సీబీఐ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. మరి పోలవరంలో జరిగిన అవినీతి ట్రాన్స్‌కాయ్ సంస్థ అవినీతి బాగోతంలో టీడీపీ పెద్దల పాత్రపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. మొత్తంగా బ్యాంకుల రుణాల ఎగవేత ఆరోపణలపై మరో మాజీ ఎంపీ రాయపాటిపై సీబీఐ దాడులు నిర్వహించడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. కాగా రాయపాటితో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరి కూడా బ్యాంకులకు 6 వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టాడు. అయితే ఆ కేసుల్లోంచి బయటపడేందుకు టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. మరి సీబీఐ దాడుల నేపథ్యంలో రాయపాటి ఎలా స్పందిస్తాడో చూడాలి.
