న్యూఇయర్ సందర్భంగా నేడు అనగా మంగళవారం సాయంత్రం నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్స్ అన్ని నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. 31నైట్ పార్టీలు విషయానికి వస్తే అర్ధరాత్రి ఒంటిగంట వరకే పరిమితమని పోలీసు వారు చెప్పారు. ఈ ఒక్కరోజుకి 50 స్పెషల్ బృందాలు పెట్టడం జరిగింది. మందుబాబులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ లో వెళ్ళాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ చేసిన చర్యలు తప్పవని అన్నారు. మరోపక్క తక్కువ వయస్సు వారికి మద్యం అందిస్తే అంతేకాకుండా డ్రైవింగ్ లో పోలీసులకు దొరికిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్క ఔటర్ రింగ్ రోడ్ కే అనుమతి ఇచ్చారు. అది కూడా ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే ఎంట్రీ అని చెప్పారు. గత ఏడాది ఎన్నో గొడవలు జరిగిన నేపధ్యంలో ఈ ఏడాది అలా జరగకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
