తెలంగాణ రాష్ట్ర ఆధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్ ,హైదరాబాద్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నూతన సంవత్సరానికి సంబంధించిన 2020 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వలన అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక రాష్ట్రంలోని మహిళల్లో చైతన్యం పెరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇస్తున్న రెండు వేల పింఛన్ తో వృద్ధులు గౌరవంగా బతుకుతున్నారని అన్నారు. కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్లతో ఆడబిడ్డల పెళ్లిల్లు గౌరవంగా జరుగుతున్నాయి. మహిళలు బిజెనెస్ చేస్తే మరింత అభివృద్ధి సాధిస్తారని ఆయన ఉద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు యాదవ్,పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.