Home / SLIDER / డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!

డిసెంబర్ 31లోపు మీరు తప్పకుండా చేయాల్సినవి ఇవే..!

ఇంకొన్ని గంటల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి సరికొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనున్న సంగతి విదితమే. అయితే రేపు డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు లోపు తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులున్నాయి. అవి ఏంటో తెలుసుకుందామా..?
* ఆధార్ – పాన్ లింక్
దేశంలో ఉన్న పాన్ కార్డు వినియోగదారులంతా తమ తమ కార్డులను ఈ నెల ముప్పై ఒకటో తారీఖు లోపు ఆధార్ కార్డుకు లింకప్ చేస్కోవాలని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.
* ఇన్ కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్
2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు గాను ఇంకా ఇన్‌కమ్‌టాక్స్‌ రిటర్న్స్‌ను ఫైల్‌ చేయని వారు 2019, డిసెంబర్‌ 31వ తేదీ లోపు రూ.5వేల ఆలస్య రుసుముతో ఆ రిటర్న్స్‌ను ఫైల్‌ చేసేందుకు ఐటీ శాఖ గడువిచ్చింది. ఇక డిసెంబర్‌ 31వ తేదీ దాటితే రూ.10వేల ఆలస్య రుసుముతో రిటర్న్స్‌ ఫైల్‌ చేయాల్సి ఉంటుంది.

* ఎస్‌బీఐ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డు మార్పు…

పాత ఎస్‌బీఐ ఏటీఎం కమ్‌ డెబిట్‌ కార్డులను వాడుతున్న వారు 2019, డిసెంబర్‌ 31వ తేదీ లోపు ఆ కార్డులను కొత్త ఈఎంవీ చిప్‌ ఆధారిత కార్డులతో మార్చుకోవాల్సి ఉంటుందని ఎస్‌బీఐ తెలిపింది. లేదంటే పాత కార్డులు 1వ తేదీ నుంచి పనిచేయవు.

*అడ్వాన్స్‌ టాక్స్‌ చెల్లింపు…

దేశంలోని ఈశాన్య రాష్ర్టాలకు చెందిన వారు తమ అడ్వాన్స్‌ టాక్స్‌ను చెల్లించేందుకు డిసెంబర్‌ 31వ తేదీని ఆఖరి గడువుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ నిర్ణయించింది.

* ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు…

స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ (ఎల్ఆర్ఎస్‌)కు గాను హెచ్‌ఎండీఏ డిసెంబ‌ర్ 31వ తేదీ వ‌ర‌కు ఆఖ‌రి గ‌డువును నిర్ణ‌యించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat