సందేశాత్మక చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో.. స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇప్పటికే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుపుకోనున్నది. అయితే ఈ మూవీలో మెగాస్టార్ సరసన రెజీనా నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి.
ఇదే నిజమైతే రెజీనా అతి తక్కువ సమయంలో మెగా స్టార్ పక్కన నటించే అవకాశం దక్కించుకున్న యంగ్ హీరోయిన్ గా పేరు సంపాదిస్తుంది. తనయుడు రామ్ చరణ్ తేజ్ కొణిదెల ప్రోడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించనున్నాడు.