Home / SLIDER / ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..

ప్రతి ఇంటా సంపద పెంచడమే కేసీఆర్ లక్ష్యం..

తుల ఇంట్లో సంపద పెంచడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కృషిచేస్తున్నారని,అందులో భాగంగానే మొదటగా పైలెట్ ప్రాజెక్టు పరకాల నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందని జెడ్పి చైర్మన్ గండ్ర జ్యోతి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో జిల్లా షెడ్యూల్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడిగేదెల పంపిణీ పథకం ద్వారా రూ.7 కోట్ల 4 లక్షల విలువ చేసే మంజూరు పత్రాలు 175 మంది దళిత లబ్ధిదారులకు పంపిణీ చేశారు.అనంతరం మినీ డయిరీ పైలెట్ ప్రాజెక్టు పైన లబ్ధిదారులకు అవగాహన కల్పించారు.అనంతరం ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ”దళితుల ఆర్థికాభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో పాడిగేదల పంపిణీ (మినీ డైయిరీ యూనిట్స్) కార్యక్రమం (పైలెట్ ప్రాజెక్ట్)ను మంజూరు చేసుకున్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఈ పైలెట్ ప్రాజెక్ట్ లో మొదటగా పరకాల నియోజకవర్గంలోనే ఆధ్యం పోసుకుందన్నారు.
తొలి విడతలో ఆత్మకూరు,దామెర మండలాలను ఎంపికచేసుకొని 175 యూనిట్లు మంజూరు చేసినట్లు వారు తెలిపారు.ఆత్మకూరు మండలంలో 115 యూనిట్లు,దామెర మండలంలో 60 యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు.ఒక్కో లబ్ధిదారునికి రూ.4 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు.60 శాతం సబ్సిడీ,40 శాతం బ్యా౦కు ఋణం ఉంటుందన్నారు. అంటే ఒక యూనిట్ కి రూ.2 లక్షల 40 వేలు సబ్సిడీ,లక్షా 60 వేల బ్యా౦కు ఋణం ఉంటుందన్నారు.నాలుగు లక్షలతో ప్రతి లబ్ధిదారుడికి రూ.3 లక్షల విలువైన పాడిగేదలు,రూ. 75 వేలు షెడ్డు నిర్మాణానికి,రూ. 25 వేలు దాణా కోసం అందిస్తామన్నారు.బ్యా౦కు సహకారంతో లబ్ధిదారులకు జీరో శాతం పెట్టుబడితో ఆర్థికసాయం అందచేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన పాలను ప్రభుత్వం నిర్మహించే విజయ డయిరీకి నేరుగా పొసే విధంగా ఏర్పాటు చేస్కోవడం జరిగిందన్నారు. ప్రతి లీటరు పాలకు విజయ డయిరీ యాజమాన్యం రూ.4 బోనసుగా అందచేస్తుందన్నారు.పాల ద్వారా వచ్చిన మొత్తం లాభాన్ని విజయ డయిరీ వారు బ్యా౦కులు ఇచ్చిన ఋణంలో 40 శాతం ఋణాన్నిచెల్లిస్తారన్నారు.
రెండో విడతలో పరకాల,నడికూడా,గీసుగొండ,సంగెం మండలాలను ఎంపికచేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.దళితులకు ఇంత అధిక మొత్తంలో సబ్సిడీ రుణం ఇవ్వడం ఇదే ప్రధమం అన్నారు.అన్ని రంగాల కులస్తులు అభివృద్ధికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ కి 1000 కోట్ల బడ్జెట్ పెట్టారు కేసీఆర్ గారు.ప్రభుత్వం మంజూరు చేసిన పథకాలను ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ప్రజలు సద్వినియోగం చేసుకుంటే ఇలాంటి ప్రత్యేక పథకాలు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంజూరు చేసుకోడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నారు.ఇంత మంచి ప్రాజెక్టుకోసం నాతో పాటు కష్టపడ్డ ఎస్సి.కార్పొరేషన్ ఎం.డి.గారికి,ఈ.డి.సురేష్ గారికి,విజయ డయిరి యాజమాన్యానికి,ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat